మంచిమనసులు
రచన ఆత్రేయ సంగీతం ఇళయరాజా
పాడినది జానకి బృందం
సాకీ తరికిట తరికిటతోం-4 సా-2
మగమగసా-3 సా...సా
పల్లవి ఢమరుకము మ్రోగా హిమశిఖరమూగా నటరాజు
నర్తించనీ
ఆనిటలాగ్ని వర్షించనీ
అనుపల్లవి ఢమరుకము మ్రోగా హిమశిఖరమూగా నటరాజు నర్తించనీ
తొలిరాగమడుగంటి మూగైనవేళ
చిగురాకుప్రాయాన మోడైన మానై
చిరునగవు కరువైన మరుభూమిలో
నేడు
IIఢమరుకంII
చరణం తకధీంత తకధీంత-2
తరిగిడతోం-2 తధీంత తధీంత
తత్తతరిగిడతోం
తరిగిడతోం తధీంత తధీంత తక
ఆ..... ఆ..... ఆ.....
ఏ పూజకూ నోచకే విరబూచి ఓ పూవు
వసివాడినా
ఏ పున్నమి ఛూడకే వెన్నెలలు
అమవాసగా మరెనా
ఏ తాళము లేక ఎదలోని పాట
ఏనాడో లయమారి గతి తప్పెనో
ఏ మేళమొక శృతిప మెడలోని తాళి
ఎగతాళి చేసింది తలరాతను
కురులకొక కుసుమం నొసటికొక
తిలకం
కొరతైన బ్రతుకై కొడిగట్టు
ప్రమిథై
చీకట్లు తారాడు నేడు
IIఢమరుకంII
చరణం ఆ........ ఆ.......ఆ...
తనువెల్ల సెగలాయెను నాలోన
శతకోటి చితులాయెనా
మనసెల్ల కాడాయెను చివరికది
వెలిభూదిగా మిగిలెనా
నీ నీలకంఠాన గరళాన్ని కన్న
చేదైన బ్రతుకింక బరువాయెను
నా కంటి కన్నీరు నీ కంటి
నిప్పై
దహియించనీ కన్నె ప్రాయమ్మును
హే పాలనేత్రా హే కాలరుద్రా
ఇది శాపమైతే నా పాపమైతే
కానిమ్ము రానిమ్ము ప్రళయం......
IIఢమరుకంII
సససనిని దదదమమ గగగససనీ
నినినిసస గగగమమ దదదససనీ
సగసనిసా-3 సగసనిద
నిసనిదని-3 నిసనిదప
తరిగిడ తరిగిడతోం తరిగిడతోం
కిరతిట తరిగిడతోం తరిగిడతోం
తరిగిడతోం-3 తరిగిడ తరిగిడతోం-2
తత్తతరిగిడతోం-3 తరిగిడ
తరిగిడతోం-2
తకతకిట-3 తరిగిడ తరిగిడతోం-3